
అన్నమయ్య జిల్లా
"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి:జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా రాయచోటి
లొ"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, జిల్లా ఎస్పీ, శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ.యం.వెంకటాద్రి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ.శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆధ్వర్యంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి అదనపు ఎస్పీ (అడ్మిన్) నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ (అడ్మిన్) తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సదరు ఫిర్యాదులను "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ.యం.వెంకటాద్రి తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird