పైన టమాట ట్రేలు కింద పశువులు.. డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ఏటూరునాగారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ కబేళాలకు పశువులను అక్రమంగా డీసీఎం లో తరలించడానికి డీసీఎం లో పైన టమాట పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరునాగారంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు.