
VRM MEDIA న్యూస్ ఒంటిమిట్ట
రిపోర్టర్ దాసరి శేఖర్
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండలం పరిధిలోని నేడు నర్వకాటపల్లి గ్రామం అరుంధతికాలనీ లోని దివ్యాగులకు, వృద్దులకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండలతెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎస్. గఫార్ రహిమాన్, ఎస్. సి. సెల్ సభ్యులు యం. పెద్ద సుబ్బయ్య, యం. వెంకటయ్య, బి. గోవిందు నర్వకాటపల్లి రేషన్ షాప్ డీలర్ సుధాకర్ రెడ్డి పాల్గొని రేషన్ బియ్యం పంపిణీ చేశారు. మైనార్టీ నాయకుడు గఫార్ రహిమాన్ మాట్లాతూ ప్రతినెల దివ్యగులకు, వృద్దులకు డీలరు ఇంటివద్దకేవెళ్లి బియ్యం, సరుకులు అందజేస్తారని తెలిపారు. ఇక రేషన్ బియ్యం వద్దన్న వారికీ వాటికి సరిపడ కందిపప్పు, మంచినూనే, ఇతర నిత్యావసరసరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird