Home వార్తలుఖమ్మం మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

by VRM Media
0 comments
Vrm media kallure

ది.07.06.2025  vrm media kallure

మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

విధినిరవహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావు తో పాటు కొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు పట్టణం ఎన్నెస్పీ క్రాస్ రోడ్డులోని చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని అయిన మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు
చేయగా క్రైమ్ నెంబరు 102/2025 U/s 329(4), 296(b), 79, 189 (2) r/w 190 BNS కేసు నమోదు చేసి, అట్టి కేసు విచారణ నిమిత్తం ఘటన ప్రాంతానికి ఎస్సై వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న రాయల రామారావు,తన అనుచరులతో మరల హోటల్ వద్దకు వచ్చి సాక్ష్యాలుగా ఉన్న హోటల్ సిబ్బందిని మరియు యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానని హోటల్ నడవనివ్వనని హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారంతో ఎస్సై తన పోలీస్ సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్ళిగా ఎస్సై ఎదురుగానే రాయల రామారావు @రాము తో పాటు అతని అనుచరులు మద్యం మత్తులో గొడవ చేస్తున్నారని, వారిని అక్కడి నుండి పంపించి కేసు విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్సై గారు వారిని పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాయల రామారావు @ రాము మరియు అతని అనుచరులు డ్యూటీలో ఉన్న మహిళా అధికారి విధులకు ఆటంకపరుస్తూ దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారని తెలిపారు. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్సై ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U1s 74, 189, 191 (2), 195, 132, 351(2) 2/2 190 BNS. See 7 (1) మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం పదిమందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందుతుడు రాయల రామారావు తో పాటు మొత్తం ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో రాయాల రామారావు పై తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిపారు.

2,926 Views

You may also like

Leave a Comment