

ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరికి పట్టం
షాద్ నగర్ కాంగ్రెస్ నాయకుడు రాయికల్ శ్రీనివాస్
సర్పంచ్ స్థాయి నుండి మంత్రి స్థాయి వరకు ఎదిగిన ముదిరాజుల ముద్దుబిడ్డ మంత్రి వాకిటి శ్రీహరికి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం రాయికల్ శ్రీనివాస్ హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ముదిరాజుల పట్ల ఎంతో గౌరవంగా మంత్రి పదవిని కేటాయించి వారికి గౌరవం ఇవ్వడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో మంచి ఆత్మీయ మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప కార్యకర్తగా ఎదిగి నేడు మంత్రి స్థాయికి ఎదిగిన ముదిరాజ్ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి అని కొనియాడారు. శ్రీహరికి మంత్రి పదవి రావడం ముదిరాజు యావత్తు జాతిని గౌరవించడమేనని పేర్కొన్నారు.
శ్రీహరిని మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాయికల్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు..