

10-06-2025
6వ డివిజన్ ఖమ్మం
6వ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రని పరిశీలించిన
6వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగండ్ల కోటేశ్వరరావు గారు వర్షాకాలం దోమల బెడద పెరుగుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పులు, తేమ, నీటి కాలుష్యం వంటివి సాధారణ జ్వరాలకు, వైరల్ ఫీవర్లకు దారితీస్తున్నాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సైతం వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఆస్పత్రిలో వైద్యసేవల కోసం వచ్చిన గర్భిణీలతో ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పెద్దవారికి కూడా అన్ని రకాల వ్యాక్సిన్లు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని సిబ్బందిని కోరారు. వీటితో పాటుగా ప్రతి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం బిపి మరియు షుగర్ టెస్ట్ లు చేయడం అదేవిధంగా షుగర్ బీపీ కి సంబంధించి మందులను కూడా ఇవ్వడం జరుగుతుంది,డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. కావున అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.