
: అనునిత్యం ప్రజలతో మమేకమవుతున్న ఒంటిమిట్ట పంచాయితీ కార్యదర్శి సుధాకర్.
ఒంటిమిట్టVRM న్యూస్ ప్రతినిధి మౌలాలి జూన్ 11
తనదైన శైలిలో పంచాయితీని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్యదర్శి.
వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామపంచాయతీ సెక్రటరీ సుధాకర్ సేవలు మరుపురానివి అంటున్న పంచాయితీ ప్రజలు ఎందుకు ఇలా అంటున్నారంటే గడిచిన ప్రభుత్వాలలో వచ్చిన పంచాయితీ కార్యదర్శులు ఎవ్వరు కూడా పురవీధులలో తిరగడం కానీ పంచాయతీ ప్రజలతో సఖ్యత భావం కలిగి ఉండడం గానీ ప్రతి వీధులను ప్రతి వాడను వాడవాడలోని పెద్దమనుషులతో ముఖాముఖి చర్చలు చేయవలసిన పనుల గురించి ఆరాతీయుడము అవసరమైన పనులను వీలైనంత తొందరగా చేస్తున్నారని పంచాయతీ ప్రజలు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు.