

వరి విత్తనములు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న దేవీపట్నం మండల వ్యవసాయ అధికారిణి ఆర్.ప్రశాంతి ఆధ్వర్యం లో రైతులకు ఖరీఫ్ 2025 వరి విత్తనాలు ఇందుకూరుపేట వ్యవసాయ కార్యాలయం వద్ద పంపిణి చేయటం జరిగింది ప్రభుత్వం రైతులకు సబ్సిడీ లో అందిస్తున్న విత్తనాలను ప్రతి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు మంచి విత్తనాలను,వ్యవసాయ సలహాలు సౌకర్యలు అందించాలని అధికారులను కోరటం జరిగింది. రైతులకు ఆధార్,రేషన్,పట్టాదార్ పాస్ బుక్, జీరోక్స్ మరియు ఫోన్ నెంబర్ తీసుకుని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టిడిపి, బిజెపి, నాయకులు పాల్గొనగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు,సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం,కోండ్ల సురేష్ రెడ్డి,మట్టా సందీప్ నాయుడు,కొత్తపల్లి సతీష్, గొందురు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు సభ్యులు ధర్మ, వెంకన్న, మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో మొదలుకున్న వాళ్లు పాల్గొన్నారు.