జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో అవగాహన కార్యక్రమం పాస్తాపూర్ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి మాట్లాడుతూ మహిళల చట్టాలు, బాల్య వివాహాల నిర్మూలన, విద్య ప్రాముఖ్యత, హెల్ప్ లైన్ నెంబర్లు, ఆరోగ్య సూత్రాలు వంటి తదితర అంశాలు తెలియజేశారు.