



ది.19.06.2025
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మం …
Vrm media ఖమ్మం ప్రతినిధి
నగరంలోని పలు కీలకమైన రహదారిలో ట్రాఫిక్ కు అంతరాయం, పాదచారులకు అసౌకర్యం కలిగించేలా ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు గురువారం తొలగించారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు.
కమన్ బజార్, కస్బాబజార్, పాత బస్‌స్టాండు రోడ్డులో.. కిలోమీటర్ల మేర… ఫుట్ పాత్ ల మీద చిరు వ్యాపారాలు, వ్యాపార సముదాయాలు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, పండ్ల వ్యాపారాలు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడంతో పాటు వాహనాలు పార్క్ చేస్తుండడంతో ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఇటీవల వ్యాపారులకు పలు సూచనలు చేశామని తెలిపారు.
నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి .. ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా సజావుగా జరిగేలా స్దానిక వ్యాపారులు ట్రాఫిక్ పోలీసులకు సహకారించాలని సూచించారు.