
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాజీ సీఎం వైసిపి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస.విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు నిరసన కార్యక్రమం.
వైసిపి క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీగా ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చేలా చేయాలని నేటి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను తెలియజేస్తూ జిల్లా డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ ( DRO ) పద్మావతికి వినతి పత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తో పాటు అరకు ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి.భాగ్యలక్ష్మి, జిల్లా పరిధిలో పలువురు వైసిపి ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, మరియు యువత పాల్గొన్నారు.

