ఈరోజు హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులందరూ కలిసి నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి నేడు మిర్యాలగూడ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 566 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వ అధికారుల మధ్యన జరిగింది అటువంటి లబ్ధిదారులకు రెండు సంవత్సరాలు గడుస్తున్న మరి నేటి వరకు ఆ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 99 శాతం పూర్తయినవి ఆ డబుల్ బెడ్ రూమ్ లు లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు గత రెండు నెలలుగా మిర్యాలగూడలోని డి ఏ ఓ, గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి వినతి పత్రలు సమర్పించడం జరిగింది. అధికారులందరూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పడంతో మరి నేడు కలెక్టర్ గారి ఆఫీసుకు వచ్చి కలెక్టరు గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది పత్రాన్ని సంబంధిత డబుల్ బెడ్ రూమ్ ల అధికారికి కలెక్టర్ గారు చెప్పి ఇప్పించడం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణము పూర్తి అయినవి.
అట్టి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను డ్రాలో లబ్ధిదారులు ఎవరైతే పేర్లు వెళ్లినవారికి మాత్రమే ఆ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తాము అది ఆ ప్రక్రియ కూడా త్వరలోనే అవుతుంది దానికి ఒక రోడ్డు అసంపూర్తిగా ఉన్న కారణంగా డబుల్ బెడ్ రూమ్ ల సాంక్షన్ చేయటం నిలిపి వేసినాము త్వరలోనే స్థానిక శాసనసభ్యులు గారితో మరియు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి రోడ్డు వేయించి గత ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరికీ కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ స్టేట్ జైంట్ సెక్రటరీ మొహమ్మద్ నాజర్ అలీ మీర్జా, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ పర్వేజ్, జిల్లా అధ్యక్షులు ఐల వెంకన్న గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు బుర్హాన్ ఖాన్ లబ్ధిదారులు కౌసల్య, సాదిక్, మనోహర్, ఖాదర్, లల్లు, సరిత, అస్మ, ఆయేషా తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird