Home ఆంధ్రప్రదేశ్ నేకనాపురం విద్యార్థుల స్కూలు బస్సు గురించి మంత్రికి వినతిమండల టిడిపి నాయకులు

నేకనాపురం విద్యార్థుల స్కూలు బస్సు గురించి మంత్రికి వినతిమండల టిడిపి నాయకులు

by VRM Media
0 comments

VRM న్యూస్ ప్రతినిధి జూన్ 25
సిద్ధవటం మండలం నేకనాపురం గ్రామపంచాయతీ నేకనాపురం గ్రామం స్కూల్ విద్యార్థుల గురించి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, బుధవారం సాయంత్రం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ, మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించి కడప డిఎం కు చరవాణిలో త్వరగా నేకనాపురం గ్రామంలో నుండి విద్యార్థులకు త్వరగా బస్సును ఏర్పాటు చేయాలని తెలియజేశారు అనంతరం కడప డిఎం ను కలిసి త్వరగా నేకనాపురం గ్రామంలో నుండి విద్యార్థులకు బస్సును ఏర్పాటు చేయాలని మండల నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ దశరథ రామానాయుడు( దశ) నియోజవర్గ తెలుగు యువత నాయకులు వీరనాల రామచంద్ర పెద్దపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రతినిధి, ప్రతాప్ నాయుడు పాల్గొన్నారు

2,822 Views

You may also like

Leave a Comment