Home ఆంధ్రప్రదేశ్ వెన్నా శివ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా తనయుడు సాయి తర్షిత్ జన్మదిన వేడుకలు

వెన్నా శివ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా తనయుడు సాయి తర్షిత్ జన్మదిన వేడుకలు

by VRM Media
0 comments

Vrm media ప్రత్తిపాడు ప్రతినిధి రాజశేఖర్

ప్రత్తిపాడు

రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ నివాసంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా,ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గారాల తనయుడు వరుపుల సాయి తర్షిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అదే విధంగా సాయి తర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు ( శివ) ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి తర్షిత్ జన్మదిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ సందర్బంగా వెన్నా శివ మాట్లాడుతూ తమ నాయకుల వారసుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని,సాయి తర్షిత్ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని,ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాధనాల లక్ష్మీబాబు,అధిక సంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

2,809 Views

You may also like

Leave a Comment