Home ఆంధ్రప్రదేశ్ ఇది కేవలం ఒక నినాదమే కాదు, “వసుధైక కుటుంబం”మన్ కీ బాత్ 123 ఎపిసోడ్ కార్యక్రమంలో

ఇది కేవలం ఒక నినాదమే కాదు, “వసుధైక కుటుంబం”మన్ కీ బాత్ 123 ఎపిసోడ్ కార్యక్రమంలో

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ జూన్ 29

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
రాజంపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులో మాట కార్యక్రమం మన్ కి బాత్ 123 ఎపిసోడ్ ను స్థానిక ప్రజలతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న దేశవ్యాప్తంగా జరిగిన యోగా దినోత్సవం గురించి ఇవాళ ‘మన్ కీ బాత్’లో మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ గురించి ప్రస్తావించారు. యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 3 వేల మంది దివ్యాంగులు సమిష్టిగా యోగా చేసి ప్రపంచానికి స్పూర్తిగా నిలవడాన్ని కొనియాడారు. ఇలాంటి స్పూర్తి నింపే గాధలను, వ్యక్తులను దేశవాసులందరికీ పరిచయం చేస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రి , ఈ అద్భుతంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి పొట్టపోగుల ఆదినారాయణ శుభ నరసింహులు విజయ్ కుమార్ శివకృష్ణ రమణ తదితరులు పాల్గొన్నారు

2,805 Views

You may also like

Leave a Comment