

కల్లూరుVRM ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న రాష్ట్ర ప్రధాన రహదారి మద్యలో డివైడర్ సూచిక బోర్డు లేనందువల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి సమయాలలో భారీ వాహనాలు డైరెక్ట్ గా డివైడర్ పైకి ఎక్కి ప్రమాదాలకు గురి అయి ధ్వంసమైన వాహనాలు ఎన్నో ఈ నేపథ్యంలో ప్రచురించిన VRM న్యూస్ స్పందించిన సత్తుపల్లి ఎంఎల్ఏ మట్టా రాగమయి దయానంద్ ఆదేశా అనుసారం కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు సోమవారం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న డివైడర్ గుర్తించి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సెంట్రల్ పోలీసు ట్రాఫిక్ బోర్డుల కు మరమ్మత్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గుర్తించిన వాహనదారులు,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.