Home ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్పోతు గుంట రమేష్ నాయుడు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్పోతు గుంట రమేష్ నాయుడు

by VRM Media
0 comments


విజయవాడVRM న్యూస్ జూన్ 30
విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల సంఘటన పర్వ లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఐదు సెట్లు నామినేషన్ ఒకే ఒక వ్యక్తి పేరు మీద పడడం వేరొకరు ఎవరు పోటీలో లేకపోవడం వారిని ఏకగ్రీవంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర ఎన్నికల అధికారి పిసి మోహన్ గారు మరియు పాక వెంకట సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు నూతన రాష్ట్ర అధ్యక్షునికి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ గారు ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా బీజేవైఎం లో యువ నాయకుడిగా పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీగా ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు, పార్టీ నిబద్ధత పట్ల క్రమశిక్షణతో అంకుటిత దీక్షతో పని చేస్తున్న ఒక సాధారణ కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షులుగా బిజెపి అధిష్టానం ఎన్నుకోవడం ఇది మంచి శుభ పరిణామం అని వారన్నారు పివిఎన్ మాధవ్ గారు మరియు పోతుకుంట రమేష్ నాయుడు గారు ఏబీవీపీలో నుండి కలిసి పని చేస్తున్నారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు నూతన రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం చాలా అభినందనీయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జిల్లా ఇంచార్జ్ నర్సింగరావు పాల్గొన్నారు

2,807 Views

You may also like

Leave a Comment