Home వార్తలు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ …!

రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ …!

by VRM Media
0 comments

రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ …! Vrm media

ప్రతినిధి పెనుబల్లి

రైతు వేదిక పెనుబల్లి లో రాచబోయిన కోటేశ్వర రావు , వైస్ ఛైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, కల్లూరు ” నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం” అని వ్యవసాయ విశ్వవిద్యాలయం , రాజేంద్ర నగర్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తముగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని డబ్ల్యూ . జి. ఎల్. -44 వరి మినీ కిట్ మరియు ఎం.జి.జి- 385 మినీ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు ఎవరికి వారు తయారు చేసుకుని విత్తనాలు విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించాలని నలుగురికి విత్తనాలు పంచాలని పిలుపునిచ్చారు.కాబట్టి ఈ అవకాశంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పెద్దలు పంది. వెంకటేశ్వర రావు, చీకటి రామారావు,మాలోతు రాధాకృష్ణ, గోగినేని రమేష్ గారు, మోరంపూడి బాబు రావు, స్థానిక వ్యవసాయ అధికారి ప్రసాద రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు కె. నరేష్, శ్రీమతి లక్ష్మీ భవాని, శ్రీ జి నాగ రాజు, కుమారి షర్మిద, శ్రీమతి ఎన్. ఎస్. వి. సమంత, శ్రీమతి హర్ష నందిని మరియు సి. హెచ్. బుచ్చిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Vrm media
2,898 Views

You may also like

Leave a Comment