ది.03.06.2025
మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్
బక్రీద్ పండుగ పర్వదినాలను శాంతియుత వాతావరణంలో కులమతాలకు అతితంగా పరస్పరం మతాలను గౌరవించుకుంటూ..ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు సూచించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలోన సీక్వెల్ ఫంక్షన్ హాల్ లో పీస్ కమిటీ సభ్యులతో మంగళవారం శాంతి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన జిల్లాలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని అందరూ గౌరవిస్తూ.. సంప్రదాయలనుపాటించాలని అన్నారు.
త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకొనే బక్రీద్ పర్వదినం కోసం పోలీస్ అధికారులు అన్ని భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారని, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘనటలు, అసౌకర్యం కలగకుండా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని తెలిపారు. ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక కార్యక్రమాల సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు సూచించామని తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణా నివారించడానికి 7 ప్రత్యేక చెక్ పోస్టులు మరియు హోల్డింగ్ పాయింట్స్ లు ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.
పాడి ఆవులను, లేగా దూడలను క్రయవిక్రయాలు జరపరాదని పేర్కొన్నారు. ప్రధానంగా నిబంధనలు విరుద్ధంగా పశువులు అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో వుంటారని, చట్టాన్ని ఏవరు కూడా తమ చేతుల్లోకి తీసుకొని శాంతిభధ్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకొనిరావద్దని అన్నారు.
ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లు ఏర్పడకుండా, ఇతర సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సందర్బంగా వివిధ మత పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించి పోలీసు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యకు తమవంతు సహకాహరం అందజేస్తామని అన్నారు.
సమావేశంలో ఏసీపీ రమణమూర్తి, సిఐలు కరుణకర్, బాలకృష్ణ, మోహన్ బాబు, భానుప్రకాశ్ పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird