Home ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవంమరియువానమహోత్సవం 2025

ప్రపంచ పర్యావరణ దినోత్సవంమరియువానమహోత్సవం 2025

by VRM Media
0 comments

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం VRM MEDIA

మనం ప్రపంచ మొక్కల దినోత్సవం లో భాగంగా దేవీపట్నం మండలం నందు ప్రతి గ్రామపంచాయతీ లో రైతుల పొలాల్లో చేసినటువంటి చిన్న చెరువుల గట్లపై 4000 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి చిన్న చెరువు నందు 16 మొక్కలు చొప్పున 220* చిన్న చెరువులపై మొక్కలు నాటే కార్యక్రమం అలాగే అతి ముఖ్యంగా ప్రభుత్వ భవనాల నందు కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఏపీవో ఉపాధి హామీ పథకం లక్ష్మీనారాయణగారి ఆధ్వర్యంలో జరిగింది ఇందుకూరుపేట ప్రభుత్వ పాఠశాల లో కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేర ఐదు రకాల మొక్కలు రైతుల చెరువుల దగ్గర ఐదు రకాల మొక్కలు జామ,కొబ్బరి,నిమ్మ,సీతాఫలం, మామిడి ద్వారా రైతులకు నాటి అందచేయటం జరుగుతుందని తెలియచేసారు ఈ కార్యక్రమం లో ఉపాధి హామీ పథకం అధికారులు పాల్గొనగా కూటమి నాయకులు బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర ప్రధాన కార్యదర్శి కోండ్ల సాయిరాం రెడ్డి పాల్గొనగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడుప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం, కొత్తపల్లి సతీష్, సారపు ఉదయ్ కిరణ్ దొర పాల్గొన్నారు.

2,886 Views

You may also like

Leave a Comment