
125 వ,వర్ధంతి సందర్భంగా భగవాన్ బిర్సా ముండా కు ఘన నివాళి అర్పించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి.
రంపచోడవరం, జూన్ 9.VRM న్యూస్ 24
అల్లూరి సీతారామ జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం రామాలయం నందు ఏర్పాటుచేసిన భగవాన్ బిర్సా ముండా 125 వ, వర్ధంతి సందర్భంగా ఘనంగా పూలమాల లేసి నివాళులర్పించామని ఎస్టి కమిషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జి రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…భగవాన్ బిర్సా ముండా మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు,జానపద నాయకుడు 19వ శతాబ్దపు చివరి రోజులలో నేటి బీహార్,జార్ఖండ్ అటవీక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు.22 ఏళ్ల (1897) వయసులోనే బ్రిటిష్ వలసవాదంపై బ్రిటిష్రులపై యుద్ధం ప్రకటించారు.తద్వారా భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.ఇతడి గౌరవార్థం భారత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆదివాసి నాయకుడు భగవాన్ బిర్సా ముండా అన్నారు.నేటితరం యువతీ యువకులకు భగవాన్ బిర్సా ముండా స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కుండ్ల కృష్ణారెడ్డి,దేవీపట్నం బిజెపి మండల అధ్యక్షుడు కారం రామన్న దొర,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కుండ్ల సాయిరాం రెడ్డి,దేవీపట్నం బిజెపి మాజీ మండల అధ్యక్షులు కుంజం ముత్యాల రావు దొర,మండల న్యాయ సేవాధికార సంస్థ పారాలీగల్ వాలంటీరు యలగాడ నాగేశ్వరరావు,శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.