Home ఆంధ్రప్రదేశ్ 1983 నుండి తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి మండల పార్టీ అధ్యక్షులు పదవి లేదు

1983 నుండి తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి మండల పార్టీ అధ్యక్షులు పదవి లేదు

by VRM Media
0 comments

దేవీపట్నం జూన్ 17 దుర్గాప్రసాద్

దేవి పట్నం మండలం చిన్న రమణయ్యపేట గ్రామానికి చెందిన మట్ట మెహర్ బాబా గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన 2014 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నుండి దేవీపట్నం మండలం జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లు తేడాలు ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుండి ఈరోజు వరకు ఆయన ఎన్ని ఒడిదుడుకులు కష్టనష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కుంటు ఈరోజుకి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగడం జరుగుతుంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరిజయం అయ్యాక. దేవిపట్నం మండల ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలు అధిష్టానం ఆయనకు అప్పజెప్పింది ఆనాడు వైసిపి ప్రభుత్వం ని ఎదిరించి మండలంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒక పక్క తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. కార్యకర్తల కష్టఫలం భగవంతుడు ఆశీస్సులో తెలియదు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన 12 నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ యధావిధిగా మండల కమిటీ ఎలక్షన్లు రానే వచ్చాయి ఇప్పుడు అధిష్టానం గుర్తించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దేవిపట్నం మండల పార్టీ అధ్యక్షులుగా మట్టా మెహర్ బాబాగౌడ్ ని. అధిష్టానం గుర్తించవలసిందిగా దేవీపట్నం మండలం బీసీ సామాజిక పెద్దలు కోరుకుంటున్నారు.

2,854 Views

You may also like

Leave a Comment