Vrm media srinivas kallure

కల్లూరుమండల పరిధిలోని పలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రోడ్లు ఇరువైపులా కూడా చెత్తాచెదారం వ్యర్ధాలు వేస్తుండటంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు పలు గ్రామీణ ప్రాంత ప్రజలు తెలుపుతున్నారు. మండల పరిధిలోని చెన్నూరు ,పెద్ద కోరుకొండి, ఎర్రబోయినపల్లి, చిన్న కోరుకొండి ,పేరువంచ, బత్తులపల్లి, ముచ్చవరం, చుండ్రుపట్ల, తదితర గ్రామాలలో రోడ్లు పక్కన ఇరువైపులా తోపాటు వాగులు వంకలు వద్ద చెత్తాచెదారం వ్యర్ధాలు డంపింగ్ యార్డ్ కు చేరకుండానే మురుగు గ్రామంలో గృహాలకు సమీపంలో ఉండటంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. గ్రామాల్లో రోడ్డు ఇరువైపులా మరియు వాగులు వంకలు వద్ద చెత్త వ్యర్ధాలు వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే సీజన్ కు గాను ఎలాంటి వ్యాధులు లేకుండా ముందు జాగ్రత్తగా పారిశుద్ధ్యంపాటించాలని కోరుతున్నారు నిధులు కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు కార్యదర్శులు చర్చించుకుంటున్నారు, మరి పారిశుద్ధ్యం పాటించకపోతే వ్యాధులు రావా అని ప్రజలు ఒకరినొకరు అనుకుంటున్నారు VRM న్యూస్ కల్లూరు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird