కల్లూరు మండల పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, బెల్టు, టై ,బ్యాగులు, అడ్మిషన్ ఫీజులు ,పాఠశాల ఫీజులు, విక్రయాలు, పట్టించుకోని మండల విద్యాశాఖ. ధనార్జన ధ్యేయంగా యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు పాఠ్యపుస్తకాల తదితర విక్రయాలుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. పాఠశాలల్లో ఈ సంవత్సరం అత్యధికంగా మార్కులు ఎక్కువమంది పాస్ అయ్యారంటూ ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కరపత్రాలతో ప్రచారంతో ఆకర్షించి ఫీజులతో భారం మోస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10 వరకు సుమారుగా 7000 మంది విద్యను అభ్యసిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల కమిటీలు లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచడం వసూలు చేయడం లాంటివి చేస్తున్నారని ఆరోపణ వీటిపై నిఘ లేకుండానే వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ నిద్రలో ఉన్నట్లు తెలియపరుస్తున్నారు. పర్యవేక్షణ లోపం పాఠశాలల్లో ఫీజులపై సూచిక బోర్డులు లేకుండా ఎవరికి వారే ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దీనిపై కట్టుదిట్టం చేయాలనే కోరుతున్నారు. పాఠశాలలో ఉచిత విద్య చట్టం అమలవుతుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. దివ్యాంగులు పేద నిరుపేదలు కొందరికి ఉచిత విద్య అందించాలని ఆదేశాలు ఉన్నా అమలు అవుతున్నాయా లేదా పర్యవేక్షణ చేసేది ఎవరు? దానిని కనిపెట్టేది ఎవరు అనేది ప్రశ్నగా మిగిలింది. విద్యాశాఖ స్పందించి ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మండల పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు సుమారుగా 10 ఉన్న వాటిలో అమలవుతున్న ఉచిత విద్య మరియు ఫీజులు బాదుడు పుస్తకాలపై అదనపు వసూళ్లు బెల్టు టై షు పై అదనపు వసూలను అరికట్టాలని కోరుతున్నారు. VRM న్యూస్ కల్లూరు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird