Vrm Media అల్లూరి జిల్లా ప్రతినిధి సత్యనారాయణ


పిఎం జన్మాన్ హౌసింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి -ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్.
హుకుంపేట ( అల్లూరి జిల్లా ) న్యూస్ :-
అల్లూరి జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు కాపులు కృష్ణారావు నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ హుకుంపేట మండల పరిధికి సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన పీఎం జన్మన్ ఆవాస్ యోజన గృహాల పురోగతిని శనివారం వివిధ గ్రామాలకు ఆదివాసి గిరిజన సంఘం పరిశీలించిందనీ సంఘం జిల్లా ఉపాధ్యాయులు టి క్రిష్ణరావు నాయకులు లక్ష్మణరావు రామారావు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పివిటిజి గిరిజన కుటుంబాల కు 1762 గృహాలు మంజూరు చేయగా కేవలం 551 ఇండ్లకు మాత్రమే బిల్లులు చెల్లించి,1211 ఇండ్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు,బిల్లులు చెల్లించకుండా ఇండ్ల నిర్మాణాలు ఎలా ఎలా నిర్మించుకొంటారని వారు ప్రభుత్వాని ప్రశ్నించారు.ఇండ్ల బకాయిలు తక్షణమే
చెల్లించాలనీ వారు డిమాండ్ చేశారు. రూఫ్ లెవెల్ వరకు పూర్తి చేసిన నిర్మాణాలకు కనీసం పునాది బిల్లులు కూడా చెల్లించ కపోవడం బాధాకరం అన్నారు.
ఉన్న ఇండ్లు పీకేసి,ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు పూర్తికాక వర్షాకాలం సమీపించడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.
పాడేరు ఐటిడిఏ పరిధిలోని 21కోట్ల హౌసింగ్ బకాయి సొమ్ము వెంటనే విడుదల చేయాలని ఈ నెల
27న పాడేరు ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో
చేప్పట్టె మహా ధర్నాలో,ఇండ్ల లబ్ధిదారులంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు వి లక్ష్మణరావు కె రామారావు పి లింగమూర్తి డి క్రిష్ణ మూర్తి పాల్గొన్నారు.