Home Uncategorized అల్లూరి సీతారామరాజు జిల్లా స్టాపర్ పిఎస్ నారాయణ

అల్లూరి సీతారామరాజు జిల్లా స్టాపర్ పిఎస్ నారాయణ

by VRM Media
0 comments

అల్లూరి జిల్లా హుకుంపేట మండల పరిధిలో గల సచివాలయల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అందరూ మమేకమై నేడు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నేడు వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి రేయింబగళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయని, మేము ఏమీ గొంతమ్మ కోరికలు కోరటం లేదు ప్రభుత్వంకి ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నాము ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ పదోన్నత కల్పించి బదిలీలు చేయాలని, అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ కేటగిరికి చెందుతారు అనేది స్పష్టత ఇస్తూ, జూనియర్ అసిస్టెంట్ పేస్కీలు అమలు చేసి జీ. ఓ నెం 5 సవరించి సచివాలయ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునేటట్లుగా చేయాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే పోరాటం ఉదృతం చేయడం ఖాయమని ప్రభుత్వంకి హెచ్చరించారు. అనంతరం మండల అధికారికి నేటి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై ప చేస్తున్న వైఫల్యాలను తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కారం కై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రం అందజేశారు.

2,856 Views

You may also like

Leave a Comment