Home వార్తలుఖమ్మం దమ్ము చక్రాలతో రోడ్డెక్కితే ఉక్కు పాదం మోపుతాం, కల్లూరు ఎస్సై, హరిత

దమ్ము చక్రాలతో రోడ్డెక్కితే ఉక్కు పాదం మోపుతాం, కల్లూరు ఎస్సై, హరిత

by VRM Media
0 comments

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్.

ఎంతటి వారు అయినా
క్రిమినల్ కేసులు పెడతాం,

ఈ సమాచారం అందజేసిన వారి పేర్లు గోపియంగా ఉంచుతాం

కల్లూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఖరీఫ్ పనులు ప్రారంభమైనందున వరి పొలాలలో దమ్ము చేస్తున్న రైతులు బిటి రోడ్డుపై దమ్ము చక్రాలతో తిరిగితే క్రిమినల్ కేసులు పెడతామని ట్రాక్టర్
యజమానులను డ్రైవర్లను ఎస్సై హరిత హెచ్చరించారు. మండల పరిధిలోని ఎర్రబోయినపల్లి లింగాల, చెన్నూరు, వాచ్యనాయక్ తండ, రఘునాథ్ బంజర్ ,చండ్రు పట్ల, బత్తులపల్లి, పేరువంచ ,ముచ్చవరం, పాయపూరు, తదితర గ్రామాలలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు
ప్రారంభమైనందున ట్రాక్టర్ దమ్ము చక్రాలతో రోడ్డుపై తిరిగి బీటీ రోడ్లు ధ్వంసం చేస్తున్నందున నిఘా పెట్టామని దొరికితే ఎలాంటి వారినైనా వదిలేయలేదు అని రోడ్లను ధ్వంసం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే చెరువులు వ్యవసాయ బోరులు నేలబావులు ఆయకట్టు పరిధిలో వరినాట్లు ప్రారంభమైనందున రైతులు డ్రైవర్లు రోడ్లు పాడు చేయకుండా సహకరించాలని ఎస్ఐ హరిత కోరారు.

3,029 Views

You may also like

Leave a Comment