

సిద్ధవటం VRM ప్రతినిధి ఈశ్వర్ జూలై 2
సిద్దోట మండలం చాముండేశ్వరి పేట సెయింట్ ఆందోని పాఠశాలలో బుధవారం డెంగ్యూ జ్వరాలపై డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి రవిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దగ్గు జ్వరము బరువు తగ్గడం కనుగుడ్లు నొప్పులు లాంటివి లక్షణాలు ఉంటే వెంటనే వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోపరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు అనంతరం డెంగ్యూ జ్వరలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగవల్లి, జ్యోతికల, రమణయ్య, యానాదయ్య, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird