
నెల్లూరు జిల్లా బోగోలు ప్రతినిధి 02/07/2025
కిసాన్ మిత్ర ఆధ్వర్యంలో
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ లైవ్ స్టిక్ మిషన్ ( ఎన్.ఎల్.ఎం )ప్రాజెక్ట్ పై అవగాహనా సదస్సు
నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో తల్లూరు గ్రామం లో సర్పంచ్ ఇంటి దగ్గర నేషనల్ లైవ్ స్టిక్ మిషన్ ప్రాజెక్ట్ పై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎల్ ఎం ( నేషనల్ లైవ్ స్టిక్ట్ మిషన్ )స్కీమ్ ద్వారా 50% సబ్సిడీ వస్తుందని తెలిపారు . ఒక యూనిట్ వాల్యూ 20లక్షలు అని తెలియజేశారు. ఇoదులో గరిష్టం గా కోటి రూ రూపాయలు వరకు ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అర్హత అవసరం లేదని అన్నారు. అంటే కులం, మతం, చదువు, ఏమి అవసరం లేదని తెలిపారు. మరియు య స్ సి, యస్ టి,బీసీ, ఓ సి లు ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ కు అర్హులేనని తెలిపారు.
ఈ స్కీమ్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మిత్ర జిల్లా మేనేజర్ B.వెంకటేశ్వర్లు గారు కిసాన్ మిత్రా ఫీల్డ్ ఆఫీసర్ బాబు శ్రీను , సర్పంచ్ గారు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird