
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం: జులై 3.

రంగా మరణించి 36ఏళ్లు అయినా బడుగు బలహీన ప్రజలు ఆయనే స్మరించుకుంటున్నారు
నెల్లూరు జిల్లాలోనే తొలిసారి కావలిలో వంగవీటి రంగ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం రంగా విగ్రహం ఆవిష్కరణ రోజున పకృతి పులకించింది
విగ్రహావిష్కరణకు తరలివచ్చిన వేలాదిమంది వంగవీటి రంగా, టిడిపి అభిమానులు రాష్ట్ర మంత్రులు, రంగా తనయుడు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి
కావలి(షోకాజ్ న్యూస్) భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర , అరుదైన సంఘటన అని, రంగా మరణించి 36ఏళ్లు అయినా బడుగు బలహీన ప్రజలు ఆయనే స్మరించుకుంటున్నారు. మూడేళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొని ఆడారు ,పట్టణంలోని రైతు బజారు సమీపంలో ఉన్న మాగుంట పార్వతమ్మ ,ట్రాంక్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. వీరిని స్థానిక కాపు నాయకులు భారీగా బాణా సంచా కచ్చి మేళతాళలు తో ఘనంగా ఆహ్వానించారు. ఈ
సందర్భంగా మంత్రులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి డ్రోన్ సాయంతో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.
వంగవీటి రంగా కాపుల కోసమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించి అసువులు బాసరన్నారు. , రంగా మరణించి 36 ఏళ్ళు అయినా, ఇప్పటికీ ప్రజలు ఆయన్ను స్మరించుకుంటారని, పేద, బడుగు, బలహీన వర్గాలు ఆరాధ్య దైవంగా కొలుస్తారని వారు వివరించారు. రంగా ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ గొప్ప ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు లభించిం దాని వారు వివరించారు.