సర్వాయ పల్లె వద్ద జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో గుంత జయరామిరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి రితేష్ రెడ్డి గారు బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి వెళ్ళి గుంత జయరామిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.