Home ఆంధ్రప్రదేశ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపోతు గుంట రమేష్ నాయుడు..

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపోతు గుంట రమేష్ నాయుడు..

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 4.

నేడు రాజంపేటలోని ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూభారతమాత బానిస సంకెళ్లను త్రెంపుటకు ఆంగ్లేయూలనెదిరించిన ధీరుడు..
తన జీవితాన్ని దేశమాత స్వేచ్చ కోసం సమర్పణ చేసిన మన్యం వీరుడు..
అణువణువునా దేశభక్తినీ, ఆత్మ లోని జీవశక్తిని నింపుకొన్న అరివీర భయంకరుడు..
ఆంగ్లేయుల తూటాలకు ఎదురు నిలిచి బాణమై నిలిచిన రుద్రుడు
శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర నమస్సులు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మధ్య రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుకోగల ఆదినారాయణ బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ బిజెపి మండల ఉపాధ్యక్షులు ప్రసాద్ రాజు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం గిరీష్ బీజేపీ నాయకులు తోట నగేష్ పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

2,808 Views

You may also like

Leave a Comment