
రాయచోటిVRM న్యూస్ జూలై 4.


కార్యాలయంలో కమిటీల ఇంచార్జి వెంగల రావు అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. భగవాన్ సాయి రెడ్డి, హరి గారు, సునీల్ రెడ్డి గారు, గ్రామ అధ్యక్షులు, మండల్ ఇంచార్జి లు, బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జి లు ప్రత్యేక సమీక్ష సమావేశం పాల్గొన్నారు.
సమావేశంలో KSS కమిటీలు త్వరితగతిన పూర్తిచేయాలని సూచనలు ఇవ్వడమైంది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు , కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా(సూపరిపాలన @1 సంవత్సరము ), టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నేతలు సూచించారు. ప్రజలలో ప్రభుత్వ పనితీరుపై అవగాహన పెంచాలని ఆదేశించారు.
ఇట్లు,
లక్కీరెడ్డి అబ్సర్వర్ మరియు పార్లమెంట్ కార్యదర్శి
నాగముని రెడ్డి