
రాజంపేటVRM న్యూస్ జూలై 4.


నేడు రాజంపేటలోని పాత బస్టాండ్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ రాజంపేట ఆధ్వర్యంలో సీనియర్ లయన్ మాలేపాటి రామకృష్ణ నాయుడు ఆర్థిక సహకారంతో ప్రజలకు చికెనుతో కూడిన భోజనాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ గ్లోబల్ ఎక్స్టెన్షన్ టీం ( GET) జిల్లా చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పేద ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యంగా అన్నదానం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని పేద ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్న లయన్స్ క్లబ్ సేవ చేయడంలో ముందుంటుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ మాజీ అధ్యక్షులు ఆర్ వెంకటసుబ్బయ్య నాయుడు లయన్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు