
Vrm media మధిర ప్రతినిధి : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మధిరలో న్యాయవాద అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి చంద్రకుమార్ హాజరయ్యారు సీనియర్ న్యాయవాది వాసిరెడ్డి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయవ్యవస్థలో వచ్చిన మార్పులను న్యాయవాదులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. జస్టిస్ చంద్రకుమార్ పదవి విరమణ తర్వాత కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు మొదటిసారిగా మధిర ప్రాంతంలో నిర్వహిస్తున్న అత్యంత విలువైన ఈ తరగతులను మధిర పరిసర ప్రాంత న్యాయవాదులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఏఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు sk.లతీఫ్ ఓరుగంటి. శేషగిరిరావు మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లారావు ప్రధాన కార్యదర్శి జే.రమేష్ ఐఏఎల్ జిల్లా ఉపాధ్యక్షులు కావూరి రమేష్ తేలపోలు వెంకట్రావు ప్రచార కార్యదర్శి జీవీ. లక్ష్మీనారాయణ కార్యవర్గ సభ్యులు తోటా రామాంజనేయులు న్యాయవాదులు డి జగన్ మోహన్ రావు కోట జ్ఞానేశ్ సిహెచ్ రామరాజు జి శ్రీనివాస్ రావు మరియు ఇతర సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


