
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాసరాథోడ్.

కల్లూరు పట్టణ కేంద్రం గా బీసీ భవనానికి స్థలాన్ని కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బయ్యారపు నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అఖిలపక్ష కుల నాయకులతో కలిసి శనివారం నాడు స్థానిక తహసిల్దార్ పులి సాంబశివుడికి ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం తహసీల్దార్ సాంబశివుడి తో పాటుగా ఆర్డిఓ రాజేందర్ లకు శాలువాలతో సత్కరించి మహాత్మా జ్యోతి రావు పూలే చిత్రపటాలను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో
ఓసీ సమాజకవర్గం నుంచి
భాగం ప్రభాకర్ చౌదరి,అంకిరెడ్డ్ సతయ్యనారాయణరెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి* బాలసౌరి మైనారిటీ ల నుంచి బాజీ ,గౌస్ బీసీ సంక్షేమ సంఘం కల్లూరు మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ,నియోజకవర్గం నాయకులు ఆలకుంట నరసింహారావు,పమ్మి భరత్ ఏనుముల రాము, రాజబోయిన శ్రీను, మట్టా రామకృష్ణ,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు