
VRM న్యూస్ బాల మౌలాలి:

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో కుటుంబ సాధికార సారధుల పేరట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని రాజంపేట నియోజకవర్గం రెగ్యులర్ అబ్జర్వర్ చిట్టిబాబు అన్నారు. మండల కేంద్రమైన ఒంటిమిట్ట మయూర గార్డెన్స్ నందు శనివారం ఒంటిమిట్ట తెలుగు తమ్ముళ్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అందరికీ సమన్యాయం ఉంటుందని, ఒకరు పెద్ద ఒకరు చిన్న కాదని అన్నారు. సమన్వయంగా వ్యవహరించి సమావేశాన్ని విజయవంతం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి, మండల అబ్జర్వర్ ఈశ్వరప్ప, టిడిపి మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి యూనిటీ ఇన్చార్జ్ కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్ వి రమణ, మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, ఎంపీపీ ప్రతినిధి నల్లగొండ వెంకటసుబ్బారెడ్డి, బొడ్డే రమణ ఒంటిమిట్ట మండల పరిధిలోని టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.