Home ఆంధ్రప్రదేశ్ రాజన్న 76వ జయంతి సందర్భంగా పాలాభిషేకం చేసిన శిబ్యాల గ్రామస్తులు

రాజన్న 76వ జయంతి సందర్భంగా పాలాభిషేకం చేసిన శిబ్యాల గ్రామస్తులు

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామపంచాయతీలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలోని వైయస్ఆర్ విగ్రహానికి పాలాబిషేకం మరియు పూలమాలలు వేసి,భారీ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన రాయచోటి మండలం వైస్ ఎంపీపీ.బొడ్రెడ్డి నాగసుబ్బమ్మ, మరియు కుటుంబసభ్యులుపాల్గొన్నారు ఈ సంధర్భంగా గౌరవ శ్రీ రాయచోటి వైస్ ఎంపీపీ బొడ్రెడ్డి నాగసుబ్బమ్మ గారు మాట్లాడుతూ దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి మరణం అనేది లేదని, వారు చూపిన బాటలో మాట తప్పక మడమ తిప్పకుండా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు 108 అంబులెన్స్‌, ఆరోగ్య‌శ్రీ‌, రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ వంటి ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని సాయి అన్నారు జోహార్ వైఎస్ఆర్
జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు కార్యకర్తలు, నాయకులు చేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి మండలo సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, mptc లు,మాజీ mptcలు,వార్డు సభ్యులు, కన్వినర్లు, గృహసారధులు,మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు జగనన్న మరియు శ్రీకాంత్ రెడ్డి అన్న అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

2,860 Views

You may also like

Leave a Comment