

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం వైస్సార్సీపీ సోషల్ మీడియ కన్వీనర్ సాయిరాం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచి అడ్డగోలుగా ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు. టీడీపీ చెత్త పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మార్చేసారు. పేద ప్రజల నడ్డి విరిచేలా పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
మేము వస్తే ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాం అన్నాడు చంద్రబాబు. మిగులు విద్యుత్ ప్రజల నుంచి కొనుగోలు చేస్తామన్నాడు సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 15 వేల కోట్లకు పైగా ప్రజలపై విద్యుత్ భారం మోపాడు మళ్లీ ఈ ఏడాది 3,600 కోట్లతో ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్నాడు.