

కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలని కార్మికుల ఉద్యమాన్ని నీరు కార్చే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని కోరుతూ
కల్లూరు లోని జాతీయ రహదారిపై సిపిఐ అనుబంధంగా ఉన్న ఏఐటియుసి ప్రజా సంఘాలు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు వేము రాంబాబు సిపిఐ మండల కార్యదర్శి దామాల దయాకర్ రావు లు మాట్లాడుతూ పని గంటలు పెంచడం కార్మిక హక్కులను హరించడమేనని సమ్మెను అణచివేయడం యజమానుల ద్వారా కార్మిక చట్టాలను ఉల్లంఘించడం నేరం కాకుండా చూడటం కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నీరు కార్చిందని ప్రజలు రైతులు కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలకు అమలు కోసం కసరత్తు చేస్తూ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మోడీ ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు విమర్శించాయి. ఇటువంటి అన్ని చర్యలను నిలదీసేందుకు కార్మికులు రైతులకు వ్యతిరేకంగా అమలు చేసే విధానాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం చేశామని అన్ని రంగాల కార్మికులు రెవెన్యూ డివిజన్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఊడల కృష్ణ,చింతపల్లి శ్రీను, ప్రకాష్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు జానపాటి మల్లేష్, మున్సిపాలిటీ రిసోర్స్ పర్సన్ ల మండల నాయకులు జొన్నలగడ్డ కుమారి, ఐకెపి వివో ఏల సంఘం నాయకులు వేము నాగమణి ,జ్యోతి,మల్లికా, పాఠశాల స్లీపర్ల సంఘం నాయకులు రమ్య, రేవతి, మధ్యాహ్న భోజనం కార్మికుల నాయకులు పాగా సత్యవతి వెంకటలక్ష్మి, అప్సర్ బి రమాదేవి, పద్మ, ఆసుపత్రి కార్మికులు, ప్రమోద్, కోటేశ్వరి, స్వరూప సురేందర్,వంశి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.