
ఈరోజు 11/7/25 వ తేదీన ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పెన్నా ప్రాథమికోన్నత పాఠశాల యందు డాక్టర్ హీరేంద్రసింగ్ మరియు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ మాసోత్సవాలు జరపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇండ్ల సుబ్బరాయుడు గారు మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం ప్రాణాంతకమని దీనిని ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందని అక్కడ విద్యార్థి విద్యార్థులకు చెప్పడం జరిగినది ఈ డెంగ్యూ దోమ ఏడిస్ ఈజిప్టై అను ఆడ దోమ కుట్టడం వలన ఈ డెంగ్యూ జ్వరం వస్తుందని దీనిని పులి దోమ అని కూడా అంటారని ఇది చిన్నగా ఒంటిమీద తెల్లని చారలుగా కలిగి ఉంటుందని ఇది కుడితే చాలా ప్రమాదమని అక్కడి పిల్లలకు అధ్యాపకులకు వివరించడం జరిగింది ఈ దోమ కుడితే విపరీతమైన జ్వరము తలనొప్పి ఒళ్ళు నొప్పులు నడుము నొప్పి కొన్నిసార్లు వాంతులు ఇలాంటి లక్షణాలు ఉంటాయని ఇలాంటి లక్షణాలు కనబడగానే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఇలాంటి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ మన గ్రామం చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం ఇంటిలోని నీటిని అంతా పార బ్రోసితరువాత కొత్తగా నీరు పట్టుకోవడం వలన ఈ దోమలను చాలావరకు అరికట్టవచ్చునని ఈ దోమలు మంచినీళ్లలో మాత్రమే అభివృద్ధి చెందుతాయని ఇవి మనిషి మోకాలి కంటే ఎక్కువగా ఎగరలేవని ఈ దోమలు చిన్నవైన కు డితే పెద్ద ప్రమాదమని అక్కడి పిల్లలకు వివరించడం జరిగినది కనుక మీరందరూ పరిసరాల పరిశుభ్రత పాటించడం వలన ఒంటికి నిండు దుస్తులు వేసుకోవడం వలన రాత్రిపూట దోమతెరలు వాడటం వలన ఇండ్లలో వేపాకు పొగ వేసుకోవడం వలన ఈ దోమల బారి నుండి మనము మనల్ని రక్షించుకోవచ్చనిఅక్కడ పిల్లలకు ఆరోగ్య సలహాలు ఇచ్చారు అలాగే ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హీరేంద్రసింగ్ గారు మాట్లాడుతూ జనాభా పెరుగుదల వలన కలిగే ఆర్థిక మరియు వనరుల నష్టాల గురించి పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు వివరించడం జరిగినది ఆడపిల్లలకు సరైన వయసులో వివాహం చేయాలని ఆడపిల్ల మానసికంగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తల్లి కావాలి అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ప్రపంచ జనాభా కూడా ఆరోగ్యంగా ఉంటుందని మరియు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అలా ప్రోత్సహించిన తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని కనుక ఆడపిల్లలకు సరైన వయసులో వివాహం చేయాలని అప్పుడే ఆడపిల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా మంచి ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనిస్తుందని అక్కడివారికి వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రాథమికోన్నత పాఠశాల కన్వీనర్ రామయ్య గారు సూపర్వైజర్ లక్ష్మీనరసమ భాస్కర్ రెడ్డి ఏఎన్ఎం సరోజమ్మ హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఆశా వర్కర్లు అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగినది
