

రాజంపేట :VRM న్యూస్ జూలై 11
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, యువనేత నారా లోకేష్ దిశానిర్దేశనలో, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు చొరవతో “సూపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ముద్రించిన పోస్టర్లను అంటిస్తూ, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్దమవ్వాలి అని నాగముని రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ప్రచారం ద్వారా ప్రజలతో నేరుగా కలిసేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు అవకాశమవుతుంది.
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి మాట్లాడుతూ, “ ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రతి మనసును గెలుచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం,” అని తెలిపారు.
అలాగే ప్రజల నుంచి సహకారం అందాలని, ప్రభుత్వం చేపట్టిన మేలులు ప్రతి కుటుంబానికి వివరించాలని కార్యకర్తలను కోరారు.