యూరియా దొరక రైతు ఇబ్బందులు పట్టించుకోని అధికారులు,

కల్లూరు జులై11(వి ఆర్ ఏం న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ ):
ఎండి పోతున్న పంటలకు సాగర్ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు కల్లూరు మండల రైతులు వేడుకున్నారు.
ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ కమిటీ సభ్యులు పసుమర్తి చందర్రావు అధ్యక్షతన కల్లూరు మండల రైతుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ కమిటీ సభ్యులు చందర్రావు రైతుల పక్షాన మాట్లాడుతూ కల్లూరు మండలంలో రైతులు వర్షాన్ని నమ్ముకొని రెండు వారాలు ముందుగా దుక్కులు దున్నుకొని కరివేత చల్లగా రుతుపవనాలు వెనక్కు వెళ్లడంతో, నాగార్జునసాగర్ కాలవ ఆయకట్టున ఉన్న రైతుల వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రైతులకు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రైతు రుణమాఫీ, సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు 500 బోనస్,రైతుభరోసా ఇలా చాలా రకాలుగా రైతులకు మేలు చేసారని ఖమ్మం జిల్లాలోనే వరి ఎక్కువగా పండించే కల్లూరు మండలంలో సుమారు 33 వేల ఎకరాలు (ఇందులో 80% వరి పండించే రైతులే అధికం) ఇప్పుడు నీళ్లు లేక వరి పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని రైతులకు ఇంత మేలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల వరి పొలాలు ఎండిపోకుండా చూడాలని స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక మండలం నివాసి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కి పత్రిక ముఖంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలాలని రైతుల పక్షాన విన్నవించుకుంటూ, అలానే కల్లూరు మండలంలో రైతులు యూరియా కొరతతో కొంతమేర ఆవేదనకు గురవుతున్న నేపథ్యంలో రైతులకు సరిపడా యూరియాను కూడా అందుబాటులో ఉంచాలని పత్రికా సమావేశం లో రైతుల పక్షాన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు మాజీ జెడ్పిటిసి కో ఆప్షన్ సభ్యులు షేక్ యాకూబ్ అలీ, కల్లూరు మాజీ సర్పంచ్ బంకా బాబు, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు కళ్యాణ వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి వెంగళరావు, సత్తెనపల్లి చిన్న కన్నయ్య,మిట్టపల్లి వెంకటేశ్వరరావు, యాస శ్రీకాంత్,కుసునూరు బాల నాగేశ్వరరావు, జక్కంపూడి కిషోర్, గుండ్ల రవీంద్ర, కిష్టంశెట్టి కొండలు,రాము, అబ్బూరి శ్రీను, షేక్ మైబు, మారబోయిన శ్రీను, దొంగల కృష్ణ,కర్నాటి పిచ్చిరెడ్డి,దాసరి వెంకటేశ్వరరావు, షేక్ యూసుబ్, కుంచాల గురువయ్య,కొత్తపల్లి వీరేంద్ర తదితర రైతులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ నీళ్లు వదిలి నారుమల్లు కాపాడండి,