

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ప్రశంసలు కురిపించిన మంత్రులు
పాడేరు ( అల్లూరి జిల్లా ) న్యూస్ :-
అల్లూరి జిల్లా పాడేరులో శుక్రవారం హోం మినిస్టర్ వంగలపూడి అనిత పర్యటించారు.ముందుగా పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన చైతన్యం 2025 గంజాయిరహిత సమాజం, అవగాహన కార్యక్రమంలో హోం మంత్రి అనిత మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి.సంధ్యారాణి పాల్గొన్నారు. ముందుగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం -స్వచ్ఛ సంకల్పం పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రులు అధికారులు గంజాయి పంటలు విడిచి వ్యవసాయం చేసుకుంటున్నా రైతులకు ప్రత్యామ్నాయ పంటలుగా విత్తనాలు పంటల మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని, ఎందుకంటే మన్యం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గిరిజనులు అమాయకులు వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి గిరిజన ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం ఎప్పుడు ఆయనలో కనిపిస్తుందని ప్రభుత్వంతో పోరాడి మరి నిధులు మంజూరు చేసి ప్రజలకు మేలు చేసే ఏకైక వ్యక్తి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అని ఇటువంటి కలెక్టర్ అల్లూరి జిల్లాకు రావడం ఇక్కడ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావించాలని అన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రం గంజాయి రహితంగా చేయాలని నిర్ణయం తీసుకుందని ఈ తరుణంలో ఈ గంజాయి నిర్మూలనకు కూడా ఆయన ఎంతో కృషి చేశారని, అనేక ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గంజాయి కి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు. గత ఏడాది 60 వేల ఎకరాల్లో గంజాయి నిర్మూలించి నేటికీ 10 నుండి 20 ఎకరాల్లో మాత్రమే గంజాయి గుర్తించే స్థాయికి కూటమి ప్రభుత్వం కృషి చేసిందని ఆమె అన్నారు. గత ఏడాది గంజాయి పంటకు ప్రత్యామ్నాయంగా 13 వేల ఎకరాల్లో ఆల్టర్నేటివ్ క్రాఫ్ట్ ని అందజేశామని, ఈ ఏడాది 33 వేల ఎకరాల్లో 44 రకాల పంటలను మొక్కలను విత్తనాలను రైతులకు అందజేశామని, దీని ద్వారా 25 వేల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉందని తెలియజేశారు. కథ ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోక గంజాయి దొరికే స్థితికి దిగజారిందని విమర్శించారు. నేడు ఆ విద్యార్థులకే అవగాహన కల్పించి ఈగల్ టీం లో భాగస్తులను చేసి గంజాయి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నేడు ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత తో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జిసిసి చైర్మన్ కిడారి.శ్రవణ్ కుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేరి.దొన్ను దొర, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, డీఎస్పీ అహ్మద్ మరియు వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird