
VRM న్యూస్ రాజంపేట ఇంచార్జ్. రవి బాబు
తలపాక ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం.,
తాళ్లపాక గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు, గ్రామస్తులు, యువత ,జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు నాగోతు రమేష్ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు,నిర్వహించి యల్లటూరు శ్రీనివాస రాజు కి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తదుపరి గ్రామస్థులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తాళ్లపాక గ్రామప్రజలు, రాజంపేట మండల ప్రజలు, స్థానిక జనసేన పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.