రేణుక చౌదరి ప్రెస్ మీట్ లో హామీ తీసుకున్న టీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం.. ఖమ్మం. దశాబ్దాల జర్నలిస్టుల కల సాకారం కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు రాబోతున్నాయి. శుక్రవారం ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ప్రెస్ మీట్ తర్వాత టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాస్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను రేణుక చౌదరి దృష్టికు తీసుకొని వెళ్లారు. దీంతో ఆమె జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య నాకు తెలుసు, రాబోయే రోజుల్లో డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల పంపిణీ జరుగుతుందని ఆమె టీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం కు హామీనిచ్చారు. రాష్ట్రంలో కీలక, సీనియర్ మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. వారి సహకారంతో జర్నలిస్టుల జీవిత కాల కల సాకారం అవుతుందని ఆమె భరోసానిచ్చారు