Vrm media ప్రతినిధి తిరుమలయపాలెం



ది.12.07.2025
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు అకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. శనివారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, విచారణలో వున్న కేసులు, చార్జిషీట్, ఫంక్షనల్ వర్టికల్స్, 5s అమలు, HRMS, CCTNS, జనరల్ డైరీ రికార్డులు, హిస్టరీ షీట్స్, కేసుల్లో వున్న వాహనాలను పరిశీలించారు. రిసెప్షన్, పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు తదితర అంశాలను పరిశీలించారు. అదేవిధంగా అక్రమ రవాణా కట్టడికి విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కు డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. పి ఆర్ వో