
సిద్దవటం: VRM న్యూస్ ప్రతినిధి జూలై 13
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, యువ నేత నారా లోకేష్ అధ్యక్షతన, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో, టక్కోలు గ్రామం మాదిగవాడలో “సూపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం కాలంలో అమలైన అభివృద్ధి,మహిళల కోసం ఉచిత బస్సులు వంటి సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రతి గడప తొక్కుతూ, చంద్రన్న కు, లోకేష్ బాబుకు ప్రజలు జె జె లు పలుకే విధంగా జనాల్లో ఉత్సాహం నింపారు పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి
ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నపరెడ్డి ,MPTC నెలటూరి సుబ్బమ్మ, వీర రెడ్డి, రాముడు, శంకర, సుబ్బయ్య, నిత్యపూజయ్య, విజయకుమార్, కొండయ్య, సుబ్బయ్య, టక్కోలు ఎస్సి కాలనీ వాసులు, టీడీపీ కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird