
Vrm media ప్రతినిధి


బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్న ఆడపడుచులు
ఆషాడ మాసం పురస్కరించుకొని న్యాల్కల్ మండల పరిధిలో ఉన్నటువంటి తా ట్ పల్లి భవానీ మాత అమ్మవారి బోనాల పండుగను గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు, దీప దూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడపడుచులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. డప్పు చప్పుళ్లతో బోనాలు నెత్తిన పెట్టుకొని కాలినడకన భవాని మాత ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్ళు
శివసత్తుల పూనకాలతో పండుగ సందడి హోరెత్తింది.
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆషాడ మాసం పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని,
వానలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని ప్రతి ఇంటా పసిడిసిరులు కురవాలని ఆ అమ్మవారికి వేడుకున్నట్టు తెలిపారు.. అనంతరం
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు చిన్నారులు భవాని మాత భక్తులు తదితరులు పాల్గొన్నారు.