


ది 14-07-2025 ( సోమవారం )
*గుడ్ మార్నింగ్ సత్తుపల్లి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో నేడు ప్రజలతో మమేకమవుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ .
ప్రజల వద్దకే ప్రజా పాలన తీసుకొస్తున్న ఎమ్మెల్యే మట్టా
అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో కలిసి మార్నింగ్ వాకలో సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ .
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో మార్నింగ్ వాకింగ్లో భాగంగా ప్రతి ఇంటి ముందుకు వెళ్లి వారి సమస్యలన్నీ అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేనే వారి ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కల్లూరు మున్సిపాలిటీ ప్రజలు.
బీసీ రోడ్స్ సైడ్ డ్రాయింగ్స్ పరిశుభ్రత గురించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే గారు.
ఎమ్మెల్యే రాగమయి దయానంద గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కల్లూరు మండల ప్రజలు, పంచాయతీ గా ఉన్న కల్లూరు నీ మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేస్తుండటం మాకు ఎంతో ఆనందంగా ఉందని వారి ఆనందాన్ని వెళ్లగొచ్చటం జరిగింది.
స్థానిక కల్లూరు మండలి వాసులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, అదేవిధంగా మంత్రి తుమ్మల బట్టి గారి ప్రోత్బలంతో, మా ఆధ్వర్యంలో తప్పకుండా కల్లూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఆర్డిఓ రాజేంద్ర గౌడ్ ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్, నవ్య కాంత్, ఏపీవో ఏపీఎం విద్యుత్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, అంగనవాడి, ఆశాలు,మరియు కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ చౌదరి, భాగం ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కి నేని కృష్ణ,ఏనుగు సత్యంబాబు, ఆలకుంట నరసింహారావు, లక్కినేని రమేష్, పోట్రూ అర్జున్ రావు, నల్లగట్ల పుల్లయ్య, మట్టా రామకృష్ణ భూక్య శివకుమార్ నాయక్ బానోత్ పంతులు, బానోతు చందు మైనార్టీ నాయకులు, ఎస్కే ఉస్మాన్ తురబ్ అలీ, పెద్దబోయిన శ్రీనివాసరావు, పొన్నూరు వెంకటేశ్వరరావు తాండూ రాములు కంభంపాటి పుల్లాచారి, బైర్ల కాంతారావు, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్లూరు మండల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొనడం జరిగింది.